'అలమేలుమంగ' విషయంలో తేజ అలా ఫిక్స్ అయ్యాడట!
- విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా తేజ
- గోపీచంద్ జోడీగా తొలిసారి కీర్తి సురేశ్
- ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్
'నేనేరాజు నేనేమంత్రి' .. 'సీత' సినిమాల్లో కాజల్ ను తీసుకున్న తేజ, ఈ సినిమాలోను కాజల్ ను సెట్ చేయాలనే చూశారు .. కానీ కుదరలేదు. ఆ తరువాత సాయిపల్లవితోను సంప్రదింపులు నడిచాయి. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన, ఆమె డేట్స్ సర్దుబాటు కాలేదు. దాంతో కీర్తి సురేశ్ లైన్లోకి వచ్చింది. 'జయం' .. 'నిజం' సినిమాల్లో గోపీచంద్ ను విలన్ గా చూపించిన తేజ, ఈసారి హీరోగా చూపిస్తూ చేయనున్న సినిమా కావడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.