గాన గంధర్వుడితో అరుదైన ఫొటో పంచుకున్న తమన్
- సియోల్ ఎయిర్ పోర్టులో ఎస్పీ బాలుతో తమన్
- 1996లో అమెరికా వెళుతున్నప్పటి ఫొటో
- నిక్కర్ వేసుకుని కనిపించిన తమన్
- నాడు బాలు ట్రూప్ లో తానే డ్రమ్మర్ నని వెల్లడి
దక్షిణ కొరియాలోని సియోల్ ఎయిర్ పోర్టులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తమన్ కలిసి ఉన్నప్పటి ఫొటో అది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వెళుతుండగా ఆ ఫొటో తీసుకున్నట్టు తమన్ వెల్లడించారు. అది 1996 నాటి ఫొటో అని తెలిపారు. ఓ కచేరీ కోసం తాము అమెరికా వెళుతున్నామని, నాడు బాలసుబ్రహ్మణ్యం బృందంలో తాను అత్యంత పిన్నవయస్కుడైన డ్రమ్మర్ నని తమన్ పేర్కొన్నారు.