చనిపోయిన తన మావటిని కడసారి చూసేందుకు వచ్చిన గజరాజు... మనసులను కదిలిస్తున్న వీడియో!
- కేరళలో ఘటన
- క్యాన్సర్ తో చనిపోయిన మావటి
- మావటి ఇంటికి వచ్చిన ఏనుగు
- నివాళులు అర్పించిన వైనం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటుచేసుకుంది. ఆ మావటి పేరు కున్నక్కడ్ దామోదరన్ నాయర్. 74 ఏళ్ల నాయర్ ను స్థానికులు ఓమన్ చెట్టన్ అని పిలుస్తుంటారు. ఆయన గత 6 దశాబ్దాలుగా ఏనుగుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కాగా, ఏనుగు పేరు పాల్ఘాట్ బ్రహ్మదత్తన్. ఓమన్ చెట్టన్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న కన్నుమూశాడు. ఈ సందర్భంగానే ఆ గజరాజును దాని యజమాని మావటి ఇంటికి తీసుకువచ్చారు. ఏనుగు బ్రహ్మదత్తన్ నివాళులు అర్పిస్తుండడాన్ని స్థానికులందరూ శోకతప్త నయనాలతో వీక్షించారు.