గవర్నర్ తమిళిసైకి పవన్ జన్మదిన శుభాకాంక్షలు.. ప్రశంసలు
- రాజ్ భవన్ ను సామాన్యులకు చేరువ చేశారని ప్రశంస
- తోబుట్టువులా మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు
- ఆమెలోని మానవీయ కోణానికి ఆమె విధానాలే నిదర్శనం
పేద పిల్లల విద్య, వారి సర్వతోముఖాభివృద్ధి గురించి నిరంతరం ఆలోచిస్తున్నారన్నారు. స్వతహాగా వైద్యురాలైన తమిళిసై ఓ తోబుట్టువులా మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం పరితపిస్తున్న ఆమెకు ఆ దేవదేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను అందించాలని ఆకాంక్షించారు.