Corona Virus: దేశంలో కొత్త‌గా 1,32,788 మందికి క‌రోనా నిర్ధార‌ణ‌

 Media Bulletin on status of positive cases COVID19 in india
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,83,07,832
  • నిన్న‌ 3,207 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం  3,35,102
  • 21,85,46,667 మందికి వ్యాక్సిన్లు
దేశంలో కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య మొన్న‌టితో పోల్చితే నిన్న కాస్త పెరిగింది. మొన్న దేశంలో 1,27,510 క‌రోనా కేసులు న‌మోదుకాగా, నిన్న 1,32,788 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వాటి ప్రకారం... నిన్న 2,31,456 మంది కోలుకున్నారు.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,83,07,832కు చేరింది. మరో  3,207 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం  3,35,102కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,61,79,085  మంది కోలుకున్నారు. 17,93,645 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 21,85,46,667 మందికి వ్యాక్సిన్లు వేశారు.
        
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం  35,00,57,330 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,19,773 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News

Corona Virus
COVID19
India