ఈడబ్ల్యూఎస్ కోటాలోకి మరాఠాలు.. 10% రిజర్వేషన్లు కల్పిస్తూ మహా ప్రభుత్వం జీవో
- ఉత్తర్వులు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
- 2020 సెప్టెంబర్ 9 నుంచి అమల్లోకి
- ఎస్ఈబీసీ అపాయింట్ మెంట్లకు లైన్ క్లియర్
- ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయొద్దని సుప్రీం ఆదేశాలు
మరాఠాలను 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కిందకు తీసుకొస్తున్నట్టు జీవోలో పేర్కొంది. మరాఠా రిజర్వేషన్లపై మధ్యంతర స్టే విధించిన 2020 సెప్టెంబర్ 9 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. మధ్యంతర స్టే విధించడంతో పెండింగ్ లో పడిపోయిన ఎస్ఈబీసీ (సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) అభ్యర్థుల అపాయింట్ మెంట్లకూ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుందని తెలిపింది.
కాగా, ఏ రిజర్వేషన్ లేని మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆ రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. వార్షికాదాయం 8 లక్షల కన్నా తక్కువున్న వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అందుతాయని చెప్పారు.