అద్దె మైకులతో రెచ్చిపోయే అచ్చన్న, అయ్యన్న, కూన, గంటా ఏమైపోయారు?: విజ‌య‌సాయిరెడ్డి
Add ap7am to your home Screen

అద్దె మైకులతో రెచ్చిపోయే అచ్చన్న, అయ్యన్న, కూన, గంటా ఏమైపోయారు?: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai reddy slams tdp
  • ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుంది
  • టీడీపీ మాత్రం పరనిందకే పరిమితమైంది
  • మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం చేస్తావు బాబూ?
  • లోకేశం అంటే అచ్చన్నకున్న అభిప్రాయమే అందరిదా?
టీడీపీపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. నేడు, రేపు టీడీపీ నిర్వ‌హిస్తున్న మ‌హానాడు కార్య‌క్రమాన్ని ప్ర‌స్తావిస్తూ అందులో తీర్మానాలు చేసి సాధించేది ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

'ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుంది. టీడీపీ మాత్రం పరనిందకే పరిమితమైంది. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం చేస్తావు బాబూ? కుప్పంలో ఎందుకు కంగుతిన్నావో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో ఆ జూమ్ నాడులో ఏడవండి. ఇంకెంతకాలం ఈ ఆత్మవంచన?' అని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.

'జూమ్ మీటింగ్ అనగానే వాలిపోయే పచ్చ నేతలు ఒక్కరూ నియోజకవర్గాల్లో కనిపించరు.  ప్రజలను గాలికొదిలేశారు సరే పరామర్శల కోసం విశాఖ వచ్చిన లోకేశంనూ పట్టించుకోలేదు. అద్దె మైకులతో రెచ్చిపోయే అచ్చన్న, అయ్యన్న, కూన, గంటా ఏమైపోయారు? లోకేశం అంటే అచ్చన్నకున్న అభిప్రాయమే అందరిదా?' అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News