యాస్ తుపాను ప్రభావం.. తెలంగాణకు వర్షసూచన
- తీవ్ర తుపానుగా మారిన యాస్
- రేపు తెల్లవారుజామున తీరాన్ని తాకనున్న తుపాను
- తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
ఈరోజు విషయానికి వస్తే... వాయవ్య, ఉత్తర దిశల నుంచి తక్కువ స్థాయి గాలులు తెలంగాణ మీదకు వస్తున్నాయి. అయితే, రాగల మూడు రోజుల పాటు యాస్ తుపాను ప్రభావం కారణంగా తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తూర్పు, దక్షిణ తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.