తెలంగాణలో మరో 3,308 కరోనా పాజిటివ్ కేసుల నమోదు
Add ap7am to your home Screen

తెలంగాణలో మరో 3,308 కరోనా పాజిటివ్ కేసుల నమోదు

More positive cases identified in Telangana
  • గత 24 గంటల్లో 63,120 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 513 కొత్త కేసులు
  • తెలంగాణ వ్యాప్తంగా 21 మరణాలు
  • కరోనా నుంచి కోలుకున్న 4,723 మంది
  • పెరిగిన రికవరీ రేటు
తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 63,120 కరోనా టెస్టులు నిర్వహించగా 3,308 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 513 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 16 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,723 మంది కరోనా నుంచి కోలుకోగా, 21 మంది మరణించారు.

తెలంగాణలో ఇప్పటివరకు 5,51,035 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,04,970 మందికి కరోనా నయం అయింది. ఇంకా 42,959 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 3,106కి చేరింది.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.56 శాతం కాగా, జాతీయస్థాయిలో అది 1.1 శాతంగా ఉంది. కరోనా రోగుల రికవరీ రేటు తెలంగాణలో 91.64 శాతానికి పెరగ్గా, జాతీయస్థాయిలో అది 87.7 శాతంగా ఉంది.
Telangana
Corona Virus
Positive Cases
Deaths
Recovery Rate

More Telugu News