10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ల కోసం గ్లోబ‌ల్ టెండ‌ర్లను ఆహ్వానించిన తెలంగాణ స‌ర్కారు
Add ap7am to your home Screen

10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ల కోసం గ్లోబ‌ల్ టెండ‌ర్లను ఆహ్వానించిన తెలంగాణ స‌ర్కారు

ts govt notification for global tenders on vaccines
  • ఈ నెల 21 నుంచి గ్లోబ‌ల్ టెండ‌ర్ల దాఖ‌లుకు అవ‌కాశం
  • బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీ
  • 6 నెలల్లో 10 మిలియన్ డోసులు సరఫరా చేయాలి 
  • నెలకు 1.5 మిలియన్ డోసులు విధిగా స‌ర‌ఫ‌రా చేయాల‌ని ష‌ర‌తు
క‌రోనా వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాల‌ని ఇటీవ‌లే తెలంగాణ‌ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ  ప్ర‌భుత్వం ఈ రోజు షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్ల ద్వారా మొత్తం 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ల‌ను కొనుగోలు చేయ‌డానికి  ప్రభుత్వం సిద్ధ‌మైంది.

బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీగా ప్ర‌క‌టించింది. అయితే, ఆరు నెలల్లో 10 మిలియన్ డోసుల వాక్సిన్ల‌ను సరఫరా చేయాల్సి ఉంటుంద‌ని ష‌ర‌తు విధించింది. నెలకు 1.5 మిలియన్ డోసులు విధిగా స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉంటుందని చెప్పింది. తెలంగాణ‌లో వ్యాక్సిన్లు తీసుకునే అర్హ‌త ఉన్న వారంద‌రికీ వేయాల‌ని ఇప్ప‌టికే స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు శ‌ర‌వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటోంది.
Telangana
vaccine

More Telugu News