Telangana: తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ పొడిగింపు

Lock down extends in Telangana
షార్ట్స్‌లో చూడండి
కరోనా సెకండ్ వేవ్ ప్రభంజనాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ పొడిగించారు. ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై ఆయన మంత్రుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం 10 రోజుల లాక్ డౌన్ విధించింది. తెలంగాణలో గత కొన్నిరోజులుగా 4 వేలకు అటూఇటూగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో, లాక్ డౌన్ పొడిగించడమే మేలని రాష్ట్ర క్యాబినెట్ అభిప్రాయపడింది.
Go Back to Shorts
Telangana
Lockdown
Extension
KCR
Corona Pandemic

More Telugu News