తెలంగాణ జిల్లాల్లో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణ జిల్లాల్లో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

Telangana corona cases update
  • గత 24 గంటల్లో 44,985 కరోనా పరీక్షలు
  • 3,816 కొత్త కేసులు నమోదు
  • జీహెచ్ఎంసీలో 658 మందికి పాజిటివ్
  • పలు జిల్లాల్లో రెండంకెల్లో కేసులు
తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 44,985 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,816 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో 658 కొత్త కేసులు రాగా, జిల్లాల్లో మాత్రం కరోనా వ్యాప్తి నిదానించింది. చాలా జిల్లాల్లో రెండంకెల్లోనే కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 5,892 మంది కరోనా నుంచి కోలుకోగా, 27 మంది మృతి చెందారు.

తెలంగాణలో ఇప్పటివరకు 5,28,823 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,74,899 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 50,969 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2,955కి చేరింది.
Telangana
Corona Virus
Update
New Cases
Today

More Telugu News