చైనా నుంచి తెలంగాణ‌కు 200 ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు.. కేటీఆర్‌కు అందించిన గ్రీన్ కో
Add ap7am to your home Screen

చైనా నుంచి తెలంగాణ‌కు 200 ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు.. కేటీఆర్‌కు అందించిన గ్రీన్ కో

ktr says thanks to nda govt
  • వాటిని దిగుమ‌తి చేసిన గ్రీన్ కో సంస్థ  
  • గ్రీన్ కో సంస్థ‌కు కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు
  • క‌రోనా క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నాం
  • ఇత‌ర రాష్ట్రాల క‌రోనా రోగుల‌కు కూడా చికిత్స: కేటీఆర్ 
చైనా నుంచి కార్గో విమానంలో తెలంగాణ‌ రాష్ట్రానికి 200 ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు అందాయి. వాటిని దిగుమ‌తి చేసిన గ్రీన్ కో సంస్థ ప్ర‌తినిధులు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అందించారు. దీంతో గ్రీన్ కో సంస్థ‌కు కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ... క‌రోనా క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.

ఈ విష‌యంలో తెలంగాణ‌లో నిధుల కొర‌త లేదని కేటీఆర్ తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల క‌రోనా రోగుల‌కు కూడా తెలంగాణ‌లో చికిత్స అందుతోంద‌ని ఆయ‌న చెప్పారు. ఔష‌ధాలు, ఆక్సిజ‌న్, ఇత‌ర వైద్య ప‌రికరాలు అందించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరామ‌ని ఆయ‌న తెలిపారు. దీంతో  కేంద్ర స‌ర్కారు సానుకూలంగా స్పందించిందని వివ‌రించారు.

ktr
TRS
Telangana
Corona Virus

More Telugu News