'ఆర్య'కు 17 ఏళ్లు .. గుర్తుచేసుకున్న బన్నీ!
- సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఆర్య'
- బన్నీ క్రేజ్ ను పెంచిన మూవీ
- ఆ సినిమాను మరిచిపోలేనన్న బన్నీ
"నా జీవితంలో అతి పెద్ద మార్పు 'ఆర్య'తోనే జరిగింది. ఆ సినిమాను ఇప్పటికీ నేను ఒక అద్భుతంగానే భావిస్తూ ఉంటాను. 'ఫీల్ మై లవ్ .. ' అని నేను చెప్పిన దగ్గర నుంచి ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తూనే వస్తున్నారు. నాతో పాటు ఈ సినిమాకి పని చేసిన వాళ్లందరి జీవితాలు మారిపోయాయి. సుకుమార్ .. దిల్ రాజు .. దేవిశ్రీ ప్రసాద్ .. రత్నవేలు .. బన్నీ వాసు .. ఇలా అందరూ ఒక స్థాయికి ఎదిగిపోయారు. అలా ఈ సినిమా అందరి జీవితాలను మార్చేసింది. అలాంటి ఈ సినిమాను .. ఆ సినిమా పట్ల ప్రేక్షకులు చూపిన ఆదరణను ఎప్పటికీ మరిచిపోలేము" అని చెప్పుకొచ్చాడు.