తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మరో వారం పొడిగింపు

Night curfew extends for a week in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని రాత్రి పూట కర్ఫ్యూను మరో వారం పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ కొత్త కేసులు వెల్లువలా వస్తుండడంతో నైట్ కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయింది.

మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. నైట్ కర్ఫ్యూ సందర్భంగా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అన్ని జిల్లాల పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 7,646 పాజిటివ్ కేసులు రాగా, 53 మంది మృత్యువాత పడ్డారు.
Go Back to Shorts
Night Curfew
Telangana
Extension
Corona Virus
New Cases
Pandemic

More Telugu News