'ఆర్ ఆర్ ఆర్' మళ్లీ వాయిదా పడనుందా?
- చారిత్రక అంశంతో రూపొందుతున్న 'ఆర్ ఆర్ ఆర్'
- కరోనా కారణంగా జరుగుతున్న ఆలస్యం
- విడుదల తేదీపై పడుతున్న ప్రభావం
ముందుగా ఈ సినిమాను జూలై 30 - 2020న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగుకు అంతరాయం ఏర్పడింది. ఆ తరువాత ఈ ఏడాది జనవరి 30వ తేదీన థియేటర్లకు తీసుకువస్తామని చెప్పారు. కానీ అంతకుందు జరిగిన ఆలస్యం ఈ విడుదల తేదీపై ప్రభావం చూపింది. ఇక ఇదే ఏడాది అక్టోబర్ 13వ తేదీన పక్కా అన్నారు. కానీ ఇప్పుడు ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్లకు రావడం కష్టమనే టాక్ వినిపిస్తోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో చిత్రీకరించవలసిన సీన్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయట. అందువలన ఇంకా ఆలస్యం కావొచ్చని చెప్పుకుంటున్నారు. అది నిజమే అయితే ఎలాగో అధికారిక ప్రకటన వస్తుంది కదా!