కరోనా కట్టడికి ప్రభుత్వం ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలి: ఏపీ హైకోర్టు
- కరోనా అంశాలపై పిటిషన్లను విచారించిన హైకోర్టు
- పరీక్షల నివేదికలు త్వరగా వచ్చేలా చూడాలని ఆదేశం
- పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని వెల్లడి
- నోడల్ అధికారులను నియమించాలని స్పష్టీకరణ
కరోనా పరిస్థితి పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించాలని న్యాయస్థానం పేర్కొంది. నోడల్ అధికారుల ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఐసోలేషన్ కేంద్రాలను పెంచాలని సూచించింది. తోట సురేశ్, ఏపీ పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు స్పందించింది.