ఓ వాణిజ్య ప్రకటన సోనియా, రాహుల్ లను కించపరిచేలా ఉందంటూ కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం
- యాడ్ వీడియో రూపొందించిన స్టోరియా ఫుడ్స్
- సోనియా, రాహుల్ లను పోలిన పాత్రలతో యాడ్
- అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు
- స్టోరియా ఫుడ్స్ కార్యాలయం ఎదుట ధర్నా
ఆ యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు స్టోరియా ఫుడ్స్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. కాగా, ఈ వివాదంపై స్టోరియా ఫుడ్స్ ఇంకా స్పందించలేదు.