ప్రశ్నించడమే నచ్చని కేసీఆర్ కు ఒక మహిళ పోరాటం చేస్తే నచ్చుతుందా?: వైఎస్ షర్మిల

YS Sharmila slams CM KCR
  • కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటేటూ సీతక్క దీక్ష
  • భగ్నం చేసిన పోలీసులు
  • ఖండిస్తున్నాంటూ షర్మిల వ్యాఖ్యలు
  • సీతక్కకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు వెల్లడి
  • మహిళా ఉద్యమాలే కేసీఆర్ కు బుద్ధి చెబుతాయన్న షర్మిల
తెలంగాణలో కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క దీక్ష చేపట్టగా, పోలీసులు భగ్నం చేశారు. దీనిపై వైఎస్ షర్మిల స్పందించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిరాహార దీక్ష చేస్తున్న సీతక్కకు ఎలాంటి పరిష్కారం చూపకుండానే ప్రభుత్వం, పోలీసులు కలిసి ఆమె దీక్షను భగ్నం చేశారని షర్మిల ఆరోపించారు. దీన్ని తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజల ప్రాణాలపై పాలకులకు పట్టింపు లేకపోయినా, ఒక మహిళగా సీతక్క ప్రజల తరఫున నిలిచి వారి ఆరోగ్యం కోసం దీక్ష చేశారని, ఆమెను తాము అభినందించడమే కాకుండా, సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని షర్మిల వెల్లడించారు. ప్రశ్నించడమే నచ్చని పెద్దమనిషి కేసీఆర్ కు ఒక మహిళ పోరాటం చేస్తుంటే నచ్చుతుందా? అని ప్రశ్నించారు. ఆ అంశం జీర్ణించుకోలేకనే ప్రశ్నించే గొంతుకలను మట్టుబెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వ్యతిరేకిగా పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ కు రేపు ఆ మహిళల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమాలే బుద్ధి చెబుతాయని షర్మిల పేర్కొన్నారు.
Go Back to Shorts
Sharmila
KCR
Seethakka
Corona
Arogyasri
Telangana

More Telugu News