'విరాటపర్వం' నుంచి సాయిపల్లవి ఫెస్టివల్ లుక్
- రానా ప్రధాన పాత్రధారిగా 'విరాటపర్వం'
- గ్రామీణ యువతి పాత్రలో సాయిపల్లవి
- ముఖ్యమైన పాత్రల్లో ప్రియమణి .. నివేదా పేతురాజ్
వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన 'విరాటపర్వం'లో .. రానా ప్రధానమైన పాత్రను పోషించగా, ఆయన సరసన అలరించే పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది. తాజాగా 'ఉగాది' పండుగ కానుకగా ఈ సినిమా నుంచి సాయిపల్లవి ఫెస్టివల్ లుక్ ను వదిలారు. గ్రామీణ నేపథ్యంలోని పాతకాలంనాటి ఇల్లు .. ఆ కాలం నాటి గుమ్మానికి సాయిపల్లవి మామిడితోరణాలు కట్టింది. లంగా .. వోణి ధరించి, సంతోషంతో గడపకు పసుపు రాసి కుంకుమబొట్లు పెడుతోంది. 'ఉగాది' సందర్భంగా వదిలిన ఈ లుక్ ఎంతో నేచురల్ గా అనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రియమణి .. నివేద పేతురాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.