మోదీ, అమిత్ షా మూడో కన్ను తెరిస్తే సీఎం కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: సోయం బాపూరావు

11-04-2021 Sun 21:21 | Telangana
  • టీఆర్ఎస్ సర్కారు అవినీతిమయం అని విమర్శలు
  • ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం
  • ఎమ్మెల్యే జోగు రామన్నపై ఆరోపణలు
  • కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని వెల్లడి
  • అడ్రస్ లేకుండా చేస్తానంటూ వార్నింగ్
టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మూడో కన్ను తెరిచారంటే సీఎం కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. అవినీతి కార్యకలాపాలతో వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే జోగు రామన్నపైనా నిప్పులు చెరిగారు. జోగు రామన్న పెద్ద అవినీతిపరుడు అని, కోట్ల రూపాయల మేర అక్రమాలు చేశాడని అన్నారు. నన్ను ఏదో చేయాలని చూస్తే అడ్రస్ లేకుండా చేస్తా అని సోయం బాపూరావు హెచ్చరించారు. తాను నక్సల్స్ కే భయపడలేదని, జోగు రామన్న ఓ లెక్కా? అంటూ వ్యాఖ్యానించారు. నిజాలు మాట్లాడితే నాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు... సోయం బాపూరావు దండు కదిలితే తట్టుకోలేరు అని స్పష్టం చేశారు.
Soyam BapuraoKCRJogu RamannaTelangana

More Telugu News

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28
..more