అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకోవడంపై రమణ దీక్షితులు స్పందన
- పదవీ విరమణ చేసిన అర్చకులకు మళ్లీ బాధ్యతలు
- టీటీడీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు పునర్నియామకం
- వంశపారంపర్య హక్కులతో అర్చకులు నష్టపోయారని వెల్లడి
- ఆలయాలు మూతపడ్డాయని వివరణ
- న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారన్న రమణ దీక్షితులు
అర్చకులకు న్యాయం చేస్తామని జగన్ గతంలోనే హామీ ఇచ్చారని రమణ దీక్షితులు వెల్లడించారు. అర్చకుల హక్కులను ముఖ్యమంత్రి హోదాలో జగన్ పరిరక్షిస్తున్నారని కొనియాడారు. సాంకేతిక కారణాలతోనే వయసు నిబంధన సడలింపులో జాప్యం జరిగిందని వెల్లడించారు. రాష్ట్రంలోని దేవాలయాలను,అర్చకుల కుటుంబాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బాధాకరమని అన్నారు. వంశపారంపర్య హక్కుల రద్దుతో అర్చకులు నష్టపోయారని తెలిపారు. వంశపారంపర్య హక్కుల రద్దు నిర్ణయంతో చాలా ఆలయాలు మూతపడ్డాయని వివరించారు.