యూట్యూబ్ చానల్లో 'వైల్డ్ డాగ్' సినిమా అప్ లోడ్ చేశారంటూ కలకలం రేపిన మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్!
- నాగార్జున హీరోగా 'వైల్డ్ డాగ్' చిత్రం
- ట్వీట్ చేసిన మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్
- ఏప్రిల్ 1 నాడు జనాలను ఫూల్ చేసే ప్రయత్నం
- అదే వరుసలో ప్రచారానికి యత్నం
అయితే ఆ లింకు ఓపెన్ చేస్తే "వైల్డ్ డాగ్... ఇన్ థియేటర్స్ టుమారో" అనే సందేశం కనిపిస్తోంది. ఆ వీడియో నిడివి 2 గంటల 9 నిమిషాలు కాగా, మొదటి నుంచి చివరివరకు ఇదే సందేశం దర్శనమిస్తోంది. దాంతో మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ జనాలను ఏప్రిల్ ఫూల్ చేయడంతో పాటు, తమ చిత్రానికి వినూత్న రీతిలో ప్రచారం కల్పించినట్టయింది.