ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 21 మంది సజీవ దహనం
- లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో ఘటన
- పలువురికి తీవ్ర గాయాలు
- 37 మందిని కాపాడిన పోలీసులు
- మంటల్ని అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
- చినపోయిన వారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షార్ట్ సర్క్యూటే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం రూ.50 వేలు అందజేస్తామన్నారు.