సూర్యాపేటలో జాతీయ జూనియర్ కబడ్టీ పోటీల సందర్భంగా అపశ్రుతి... కుప్పకూలిన ప్రేక్షకుల గ్యాలరీ!
Add ap7am to your home Screen

సూర్యాపేటలో జాతీయ జూనియర్ కబడ్టీ పోటీల సందర్భంగా అపశ్రుతి... కుప్పకూలిన ప్రేక్షకుల గ్యాలరీ!

Gallery collapsed in National Junior Kabaddi tourney inauguration at Suryapet
  • నేడు కబడ్డీ పోటీలు ప్రారంభం
  • గ్యాలరీ కూలడంతో 150 మందికి గాయాలు
  • ఆసుపత్రులకు తరలించిన పోలీసులు, 108 సిబ్బంది
  • సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో ఘటన
సూర్యాపేటలో జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. అయితే ప్రారంభోత్సవం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ కూలి 150 మందికి గాయాలయ్యాయి. గ్యాలరీలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ఘటన జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో గ్యాలరీలో దాదాపు 1,500 మంది ప్రేక్షకులు ఉన్నట్టు గుర్తించారు. గాయపడినవారిని 108 సిబ్బంది, పోలీసులు ఆసుపత్రులకు తరలించారు. కాగా జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల కోసం 3 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు విచ్చేశారు.
Gallery
National Kabaddi Tournamnet
Suryapet
Police
Telangana

More Telugu News