పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ నుంచి 'కంటిపాప కంటిపాప' లిరికల్ విడుదల.. వీడియో ఇదిగో!
- వకీల్ సాబ్ నుంచి మూడో లిరికల్ విడుదల
- సంగీతాన్ని అందించిన తమన్
- పవన్ కు జంటగా నటిస్తున్న శ్రుతిహాసన్
ఇప్పటికే ఈ చిత్రానికి చెందిన రెండు పాటలను యూనిట్ విడుదల చేసింది. 'మగువ.. మగువ', 'సత్యమేవ జయతే' పాటలు విడుదలై ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్నాయి. కాసేపటి క్రితం మూడో పాటగా 'కంటిపాప.. కంటిపాప' అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజుకు చెందిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.