చాన్నాళ్ల తర్వాత.. తెలుగు సినిమాలో అనుపమ్ ఖేర్!
- 1987లో 'త్రిమూర్తులు'లో నటించిన అనుపమ్
- చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సీక్వెల్
- ధన్వంత్రి పాత్రలో నటించడానికి అంగీకారం
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన 'కార్తికేయ' సినిమా మంచి హిట్టయింది. ఇప్పుడు దీనికి ఇదే కలయికలో సీక్వెల్ చేస్తున్నారు. ఇందులో కీలక పాత్రకు అనుపమ్ ఖేర్ ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పాత్ర నచ్చడంతో చేయడానికి ఆయన కూడా హ్యాపీగా అంగీకరించినట్టు సమాచారం. ఇందులో ఆయన ధన్వంత్రి అనే విభిన్నతరహా పాత్రను పోషిస్తున్నారట.