Vijay Devarakonda: తన తమ్ముడి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda releases first look poster of Pushpaka Vimanam
షార్ట్స్‌లో చూడండి
దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాలతో పేరుతెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ ఈసారి కామెడీ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ను ఆనంద్ సోదరుడు, అగ్రహీరో విజయ్ దేవరకొండ ఇవాళ రిలీజ్ చేశాడు. దామోదర అట్టాడ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి పుష్పక విమానం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

కింగ్ ఆఫ్ ద హిల్, టాండా ప్రొడక్షన్స్ బ్యానర్లపై విజయ్, ప్రదీప్ ఎర్రబెల్లి, గోవర్ధన్ రావ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పుష్పక విమానం చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన శాన్వీ మేఘన, గీతా సైనీ కథానాయికలు. సీనియర్ నటుడు సురేశ్, సునీల్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాకు రామ్ మిరియాల, అమిత్ దాసాని, సిద్ధార్థ్ సదాశివుని సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
Go Back to Shorts
Vijay Devarakonda
Pushpaka Vimanam
Title
First Look
Anand Devarakonda
Tollywood

More Telugu News