Rajgopal Naik: భార్య, కుమార్తెను కాపాడుకునేందుకు చిరుతపులితో పోరాడి చంపేసిన కర్ణాటక వ్యక్తి

Karnataka man killed leopard to save his wife and daughter
షార్ట్స్‌లో చూడండి
కర్ణాటకలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు చిరుతపులితో వీరోచితంగా పోరాడి దాన్ని అంతమొందించాడు. కర్ణాటకలోని హసన్ జిల్లా బెండాకెరె ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాజగోపాల్ నాయక్ అనే వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి బైక్ పై వెళుతుండగా, అటవీప్రాంతంలో ఓ చిరుతపులి దాడి చేసింది. చిరుత ధాటికి బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది.

ఈ క్రమంలో ఆ చిరుత తన భార్య, కుమార్తెలను గాయపర్చడం చూసిన రాజగోపాల్ నాయక్ ప్రాణాలకు తెగించి ఆ చిరుతతో పోరాడాడు. తనకు గాయాలు అయినప్పటికీ భయపడకుండా ఆ చిరుతపులిని చంపేశాడు. చిరుత దాడిలో గాయపడిన రాజగోపాల్ తో పాటు అతడి భార్య, కుమార్తెలను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Go Back to Shorts
Rajgopal Naik
Leopard
Wife
Daughter
Karnataka

More Telugu News