ఈ విషయాన్ని వెంటనే ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళతాం: సోమిరెడ్డి
- నేతల్ని కొట్టి పోలీసులు బెదిరిస్తున్నారు
- కావలి డివిజన్‌లో పోలీసుల తీరు సరికాదు
- అల్లూరు ఎస్సై పోలీసా? వైసీపీ నాయకుడా?
- ఉత్తర ఆములూరులో పోలీసుల తీరుపై ఫిర్యాదు
అల్లూరు ఎస్సై పోలీసా? లేక వైసీపీ నాయకుడా? అంటూ ఆయన నిలదీశారు. ఉత్తర ఆములూరులో ఎన్నికల ఏజెంట్లను, టీడీపీ నేతల్ని కొట్టి బెదిరించడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించాలని, పోలీసులను అదుపు చేయాలని ఆయన అన్నారు. పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని తాము వెంటనే ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళుతున్నామని తెలిపారు.