అందుకే వైసీపీ మ‌ద్ద‌తు ప‌లుకుతోన్న అభ్య‌ర్థుల‌కు ఓట్లు వేయాలా?: క‌ళా వెంక‌ట్రావు

kala slams ycp
వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత క‌ళా వెంక‌ట్రావు మండిప‌డ్డారు. రుణ‌మాఫీ ఇవ్వ‌కుండా ప్ర‌భుత్వం అన్యాయం చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. 4, 5 విడ‌త‌ల రుణమాఫీ ఇవ్వ‌కుండా రైతులను మోసం చేస్తోంద‌ని ఆరోపించారు. రైతుల‌కు రూ.2 వేల కోట్ల బ‌కాయిలు పెట్టార‌ని ఆయ‌న చెప్పారు.

రైతుల బోర్ల‌కు మీట‌ర్లు పెడుతుండ‌డం స‌రికాద‌ని చెప్పారు. ఇటువంటి పాల‌న అందిస్తున్నందుకే వైసీపీకి ఓట్లు వేయాలా అని ప్ర‌శ్నించారు. ఇళ్ల ప‌ట్టాల పేరుతో రూ.6,500 కోట్ల అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న చెప్పారు. 20 నెల‌ల్లో రూ.2 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేశార‌ని తెలిపారు. కాగా, నేటితో పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలిద‌శ ప్ర‌చారం ముగియ‌నుంది.




Go Back to Shorts
Kala Venkata Rao
Telugudesam
YSRCP

More Telugu News