కల నిజమైందంటున్న నిధి అగర్వాల్!
- క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా సినిమా
- ఓ కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్
- తనకిది గోల్డెన్ ఫిలిం అంటున్న ముద్దుగుమ్మ
- ఇప్పటికే షూటింగులో పాల్గొంటున్న నిధి
"పవన్ కల్యాణ్ గారి సినిమాలో నటించడం చాలా ఆనందంగా వుంది. నా కల నిజమైనట్టు భావిస్తున్నాను. ఈ సినిమా నాకు తొమ్మిదోది అవుతుంది. ఇది నా కెరీర్లో గోల్డెన్ ఫిలింగా నిలిచిపోతుంది. పవన్ తో కలసి నటించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని మాత్రం అసలు అనుకోలేదు" అంటూ నిధి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఇక ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతోంది. నిధి ఇప్పటికే ఈ షూటింగులో పాల్గొంది కూడా. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో కథానాయికగా బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించే అవకాశం వుంది.