Mahesh Babu: మహిళా డైరెక్టర్ తో మహేశ్ ప్రాజక్ట్?

Mahesh to work with lady director
షార్ట్స్‌లో చూడండి
 ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు తన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'ను చేస్తున్న సంగతి విదితమే. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. మహేశ్, కీర్తి సురేశ్ లతో పాటు ఇతర తారాగణం కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంచితే, మరోపక్క మహేశ్ ఇంకో ప్రాజక్టు మీద కూడా దృష్టి పెట్టినట్టు వార్తలొస్తున్నాయి.

ఇటీవల సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో 'ఆకాశం నీ హద్దురా' అనే చిత్రం వచ్చింది. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీనికి మొదటి నుంచీ తమిళంలోనే తన కెరీర్ని కొనసాగిస్తున్న తెలుగు మహిళ సుధ కొంగర దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మహేశ్ కి బాగా నచ్చడంతో ఈ దర్శకురాలితో ఓ ప్రాజక్ట్ చేయాలని అనుకుంటున్నారట.

ఈ క్రమంలో ఇప్పటికే మహేశ్ ఇమేజ్ కి తగ్గ పవర్ ఫుల్ సబ్జెక్టును సుధ కొంగర తయారుచేశారనీ, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయనీ తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ ఓ భారీ సినిమా చేయాల్సివుంది. దానికి ముందుగా.. 'సర్కారు వారి పాట' పూర్తయిన తర్వాత సుధ కొంగర దర్శకత్వంలో చిత్రం సెట్స్ కి వెళ్లచ్చని సమాచారం.
Go Back to Shorts
Mahesh Babu
Sudha Kongara
Surya
Parashuram

More Telugu News