ముంబై స్టేషన్ లో పట్టాలు తప్పిన హైదరాబాద్ స్పెషల్ రైలు
Add ap7am to your home Screen

ముంబై స్టేషన్ లో పట్టాలు తప్పిన హైదరాబాద్ స్పెషల్ రైలు

Special train trolley derails from Chhatrapati Shivaji Maharaj Terminus
  • రాత్రి పదిగంటల సమయంలో ఘటన
  • ప్రయాణికులు సేఫ్
  • ఘటన తర్వాత మూడు రైళ్లను కుదించిన అధికారులు
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ)లో హైదరాబాద్ స్పెషల్ రైలు పట్టాలు తప్పింది. గత రాత్రి స్టేషన్ టెర్మినల్ నుంచి రైలు బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రాత్రి పది గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని, ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు.

పట్టాలు తప్పిన రైలును రిలీఫ్ రైలు సాయంతో అక్కడి నుంచి తరలించారు. ఈ  ఘటనతో అధికారులు మూడు రైళ్లను కుదించారు. నాందేడ్-సీఎస్ఎంటీ స్పెషల్ రైలు (07617)ను బైకుల్లా వరకు, లక్నో-సీఎస్ఎంటీ (02533) రైలును దాదర్ వరకు, కర్మాలి-సీఎస్ఎంటీ (02120) రైలును థానే వరకు కుదించినట్టు అధికారులు తెలిపారు.
Hyderabad
Mumbai
Chhatrapati shivaji terminus
special train

More Telugu News