పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై విజయసాయిరెడ్డి స్పందన!
- సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తాం
- ఏ అంశాలను పరిశీలించి ఈ తీర్పును వెలువరించిందో తెలుసుకుంటాం
- కొద్దిగా సమయం ఇస్తే ఆ తర్వాత దీనిపై స్పందిస్తాం
విజయవాడలో మీడియా అడిగిన ప్రశ్నలకు బదులుగా ఆయన స్పందిస్తూ... సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేస్తామని చెప్పారు. ఏ అంశాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత స్పందిస్తామని తెలిపారు. ఎన్నికలను ఉద్యోగ సంఘాలు కూడా వ్యతిరేకించాయనే విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనే ప్రశ్నకు బదులుగా... కొద్దిగా సమయం ఇస్తే... ఆ తర్వాత రియాక్ట్ అవుతామని చెప్పారు. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా... ప్రస్తుతానికి తన సమాధానం ఇదేనని అన్నారు.