ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి మీ జంట ఆదర్శంగా నిలిచింది: సునీత దంపతులకు నాగబాబు విషెస్
- ఆనందం అనేది పుట్టుకతో రాదు
- దానిని మనం వెతికి అందుకోవాలి
- రామ్, సునీత అన్వేషించి గుర్తించారు
ఆనందం అనేది పుట్టుకతో రాదని, దానిని మనం వెతికి అందుకోవాలని నాగబాబు ట్వీట్ చేశారు. రామ్, సునీత తమ సంతోషాలను అన్వేషించి గుర్తించినందుకు అభినందనలు చెబుతున్నానని అన్నారు. ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి వారి జంట ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రేమ, ఆనందం అనేవి ఎప్పటికీ వారి శాశ్వత చిరునామాగా మారాలని కోరుకుంటున్నానని చెబుతూ, వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.