అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసిన వారు కొత్తవేషం కడుతున్నారు: సీఎం జగన్

11-01-2021 Mon 14:32 | Andhra
  • అమ్మఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
  • నెల్లూరు జిల్లాలో కార్యక్రమం
  • విగ్రహాల ధ్వంసం ఘటనలపై స్పందించిన వైనం
  • చంద్రబాబు, లోకేశ్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణ
  • అప్రమత్తంగా ఉండాలని సూచన
ఏపీ సీఎం జగన్ ఇవాళ అమ్మఒడి పథకం రెండో విడత నిధుల చెల్లింపులను లాంఛనంగా ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆలయాలపై జరుగుతున్న దాడుల పట్ల ఆయన స్పందించారు. విగ్రహాలను ఎవరు ధ్వంసం చేయిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి... ధ్వంసమైన విగ్రహాలు చూస్తామని ఎందుకు వెళుతున్నారో అర్థం చేసుకోండి అని వ్యాఖ్యానించారు. రథాలు ఎందుకు తగులబెడుతున్నారో, ఆ తర్వాత రథయాత్ర ఎందుకు చేయబోతున్నారో గమనించండి అని పేర్కొన్నారు.

"ఇవాళ ప్రతిపక్షాల కడుపుమంట తీవ్రస్థాయిలో ఉంది. ఎవరూ లేని ప్రాంతాల్లో గుడులను ధ్వంసం చేస్తున్నారు. దేవుడి మీద భక్తిలేని వారే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టే ముందో, తర్వాతో ఆలయాలను టార్గెట్ చేస్తున్నారు. మనం చేసిన మంచి ప్రపంచానికి తెలియొద్దనే దాడులు చేస్తున్నారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోరాటం చేస్తున్నాం. అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసినవాళ్లు కొత్తవేషం కడుతున్నారు.  కొవిడ్ భయంతో విపక్ష నేత, ఆయన కొడుకు హైదరాబాదులో దాక్కుంటారు. సామాన్యులు బతికితే ఎంత, చస్తే ఎంత అంటూ ఆయన కోవర్టులు ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతుంటారు. ఇలాంటి వ్యక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి" అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
JaganIdols VandalizingAndhra PradeshChandrababuNara Lokesh

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more