రక్తంలో చక్కెర స్థాయులు పడిపోవడంతో కుప్పకూలిన కేంద్రమంత్రి

  • కేంద్ర మంత్రి సదానంద గౌడకు తీవ్ర అస్వస్థత
  • శివగంగ నుంచి బెంగళూరు వస్తుండగా షుగర్ డౌన్
  • చిత్రదుర్గలో ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు
  • కేంద్ర మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
కేంద్రమంత్రి సదానంద గౌడ (67) ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రస్థాయి బీజేపీ సమావేశంలో పాల్గొని శివగంగ నుంచి బెంగళూరు వస్తుండగా ఆయన రక్తంలో చక్కెరస్థాయులు పడిపోవడంతో కుప్పకూలిపోయారు. దాంతో ఆయనను ఈ సాయంత్రం చిత్రదుర్గలోని ఆస్టర్ సీఎంఐ ఆసుపత్రికి తరలించారు. సదానంద గౌడకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు షుగర్ లెవల్స్ తగ్గిపోయినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

మరిన్ని టెస్టులు నిర్వహించి చికిత్స కొనసాగించనున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరో 24 గంటలపాటు పరిశీలనలో ఉంచుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, తన ఆరోగ్యంపై మంత్రి సదానంద గౌడ ట్విట్టర్ లో వెల్లడించారు. తాను కోలుకుంటున్నట్టు తెలిపారు. తన ఆరోగ్యం పట్ల ఆందోళన వెలిబుచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వివరించారు.

Sadananda Gowda
Low Blood Sugar Levels
Chitradurga
Karnataka
BJP

More Telugu News