ప్రమాణ స్వీకారం చేయకుండానే మృతి చెందిన బీజేపీ కొత్త కార్పొరేటర్
- ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం
- కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరిక
- చికిత్స పొందుతూనే కన్నుమూత
కార్పొరేటర్‌గా ఎన్నికైనా ఇంకా ప్రమాణస్వీకారం చేయకుండానే మృతి చెందడం విషాదం నింపింది. విషయం తెలిసిన బీజేపీ నేతలు రమేశ్ గౌడ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, రమేశ్ గౌడ్ గతంలో ఎల్బీనగర్ మున్సిపల్ చైర్మన్‌గానూ పనిచేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.