పశ్చిమ బెంగాల్ గవర్నర్ ను కలిసిన సౌరవ్ గంగూలీ
- గంటసేపు కొనసాగిన సమావేశం
- వివిధ అంశాలపై చర్చ
- దాదా పాలిటిక్స్ లోకి వస్తారంటూ ప్రచారం
- భేటీపై వివరణ ఇచ్చిన గవర్నర్
అయితే, రాజ్ భవన్ వర్గాలు మాత్రం ఇది ఓ మర్యాదపూర్వక సమావేశం మాత్రమేనని, ఇందులో రాజకీయపరమైన అంశాలకు తావులేదని స్పష్టం చేశాయి. కాగా, భేటీ అనంతరం గంగూలీ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
ఇక ఈ భేటీ కారణంగా రేగిన ఊహాగానాలకు గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ ఓ ట్వీట్ తో తెరదించారు. పురాతన స్టేడియం ఈడెన్ గార్డెన్స్ ను సందర్శించాలని గంగూలీ కోరారని, అందుకు అంగీకరించానని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. కాగా, ఈడెన్ గార్డెన్స్ స్టేడియాన్ని 1864లో నిర్మించారు.