కర్నూలు జిల్లా వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడిపై హత్యాయత్నం.. కర్రలతో దాడిచేసిన దుండగులు
- వ్యాయామానికి వెళుతున్న సమయంలో దుండగుల దాడి
- టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఫిర్యాదు
- కారు పార్కింగ్ విషయంలో గొడవే కారణమన్న మోహన్‌రెడ్డి
కారు పార్కింగ్ విషయంలో తన చిన్నాన్న కుమారుడైన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి అనుచరులతో ఇటీవల జరిగిన గొడవే ఈ దాడికి కారణమని మోహన్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్కింగ్ విషయంలో తలెత్తిన గొడవను దృష్టిలో పెట్టుకుని ఈ దాడికి దిగినట్టు ఆరోపించారు. ఆయన ఫిర్యాదుతో సుబ్బారెడ్డితోపాటు వైసీపీ నేత కొండారెడ్డి, మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.