Vijay Sai Reddy: దొంగ చాటుగా డ్రాకోనియన్ లాను రుద్దుతున్నదెవరు యనమల గారూ?: విజయసాయిరెడ్డి కౌంటర్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను గ్రీస్ నియంత డ్రాకోతో పోల్చుతూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు నిన్న తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. డ్రాకో పాలనలో కొనసాగించిన అరాచకాన్ని మించిన రాజ్యాంగాన్ని జగన్ అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.
‘చిత్తుగా ఓడి కూడా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని దొంగ చాటుగా డ్రాకోనియన్ లాను రుద్దుతున్నదెవరు యనమల గారూ! ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చిన వైఎస్ జగన్ గారు ఏది చేయాలన్నా అడ్డుకుంటున్నదెవరు? ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి కూడా దర్యాప్తులు జరగకుండా రక్షణ పొందుతున్నది మీ నాయకుడు కాదా?’ అని విజయసాయిరెడ్డి నిలదీశారు.
‘సీఎంగా 14 ఏళ్లు పని చేసిన వ్యక్తి ‘క్రిమినల్’ సలహాలిస్తున్నాడు. పోలీసుల మీద కేసులు పెట్టి కాళ్ల బేరానికి తెచ్చుకోవాలంట. ప్రజల మనసులు గెలవాలని సలహాలిస్తారు ఎవరైనా. ఈయన పోలీసులను బ్లాక్ మెయిల్ చేసి కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు’ అని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుని, వారితో పోలీసులపైనే కేసులు పెట్టిస్తున్నారని చెప్పారు.