హృతిక్ రోషన్ ను మరోసారి టార్గెట్ చేసిన కంగన రనౌత్
- కంగన మెయిల్స్ కేసును క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేయాలని కోరిన హృతిక్
- ఇంకెన్నాళ్లు ఏడుస్తావంటూ కంగన ఫైర్
- జీవితంలో ముందుకు వెళ్లలేకపోతున్నాడని వ్యాఖ్య
హృతిక్ తన భార్య నుంచి విడాకులు తీసుకుని చాలా సంవత్సరాలవుతోందని, అలాగే హృతిక్-తాను విడిపోయి కూడా చాలా ఏళ్లవుతోందని కంగన తెలిపింది. భార్యతో విడిపోయిన తర్వాత హృతిక్ ఎవరితోనూ డేటింగ్ కూడా చేయలేదని చెప్పింది. అయినా తన జీవితంలో ఆయన ముందుకు వెళ్లలేకపోతున్నాడని వ్యాఖ్యానించింది. ఇతర విషయాలను వదిలేసి... ఒక చిన్న విషయం గురించి ఇంకెన్నాళ్లు ఏడుస్తావంటూ హృతిక్ పై మండిపడింది.