Harsha Kumar: సీఎంను కలవకుండా పోలవరం నిర్వాసితులను పోలీసులు అడ్డుకున్నారు: మాజీ ఎంపీ హర్షకుమార్

Former MP Harsha Kumar slams AP Government
షార్ట్స్‌లో చూడండి
మాజీ ఎంపీ హర్షకుమార్ ఏపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతోందని విమర్శించారు. సీఎంను కలవకుండా పోలవరం నిర్వాసితులను పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తరఫున పోలవరం నిర్వాసితుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

దళితులపై దాడులు చేస్తున్నవారికి ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. చీరాలలో మాస్కు లేదని కిరణ్ కుమార్ ను పోలీసులు కొట్టి చంపారని, వారిపై కేసు లేదని అన్నారు. ఇలాంటివే అనేక రకాలుగా దళితులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. దళితులు, మైనారిటీలపై జరిగిన దాడులపై కమిటీ వేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Harsha Kumar
Andhra Pradesh
YSRCP
Jagan
Polavaram Project
Congress

More Telugu News