డ్రైనేజీల పరిసరాల్లో పడుకుని, అక్కడి ప్రజలకు ఎప్పుడు భరోసానిస్తావు విజయసాయిరెడ్డి?: బుద్ధా వెంకన్న
- నువ్వు విశాఖలో చేసిన ఓవర్ యాక్షన్, ఫొటో షూట్ లు ఇంకా గుర్తున్నాయి
- మరి ఏలూరు ఎప్పుడు వస్తున్నావ్?
- అసలే చలి కాలం, ముసలోడివి తట్టుకోలేవు ఏమో
ఆ సమయంలో విజయసాయిరెడ్డి తీసుకున్న ఫొటోను టీడీపీ నేత బుద్ధా వెంకన్న పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఏలూరులో ప్రజలు వింత వ్యాధితో బాధపడుతుంటే అక్కడకు ఎందుకు వెళ్లట్లేదని నిలదీశారు.
‘నువ్వు విశాఖలో చేసిన ఓవర్ యాక్షన్, ఫొటో షూట్ లు, ఇంకా గుర్తున్నాయి విజయసాయి. మరి ఏలూరు ఎప్పుడు వస్తున్నావ్? అక్కడ నీరు తాగి, అపరిశుభ్రంగా ఉన్న డ్రైనేజీల పరిసరాల్లో పడుకుని, అక్కడ ప్రజలకు ఎప్పుడు భరోసా ఇస్తున్నావ్? అసలే చలి కాలం, ముసలోడివి తట్టుకోలేవు ఏమో. నువ్వు రాకపోతే, తాడేపల్లి నుంచి నీ అల్లుడునైనా పంపించ్చు’ అని బుద్ధా వెంకన్న చురకలంటించారు.