ఇరాన్ ముందు ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి: పీట్ హెగ్‌సెత్
- ఇరాన్‌పై నౌకా దిగ్బంధనాన్ని తీవ్రతరం చేసిన అమెరికా
- అణు ఒప్పందం లేదా ఆర్థిక పతనం అనే స్పష్టమైన ఎంపికను ఇచ్చిన యూఎస్
- హెచ్చరికలు పెడచెవిన పెట్టిన నౌకపై కాల్పులు జరిపిన అమెరికా దళాలు
- హర్మూజ్ జలసంధి గుండా వెళ్లాలంటే తమ అనుమతి తప్పనిసరి అని స్పష్టం
- అవసరమైతే భారీ సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన
ఇరాన్‌పై అమెరికా తన సైనిక ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసింది. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో చేపట్టిన నౌకా దిగ్బంధనాన్ని గంటగంటకూ కఠినతరం చేస్తున్నామని శుక్రవారం ప్రకటించింది. ఇరాన్ ముందు రెండే మార్గాలున్నాయని, అణు ఒప్పందానికి అంగీకరించడం లేదా తీవ్ర ఆర్థిక పతనానికి సిద్ధమవడం అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ స్పష్టం చేశారు.
పెంటగాన్‌లో విలేకరులతో మాట్లాడిన హెగ్‌సెత్, ఈ ఆపరేషన్ కొద్ది వారాల్లోనే నిర్ణయాత్మక ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. "ఇరాన్ అణుబాంబును కలిగి ఉండటానికి వీల్లేదు అన్నదే మా లక్ష్యం. ఒమన్ గల్ఫ్ నుంచి అంతర్జాతీయ జలాల వరకు మా నౌకాదళం కఠిన దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇరాన్ పోర్టులకు వచ్చే, వెళ్లే ప్రతి నౌకను వెనక్కి పంపుతున్నాం" అని వివరించారు. మరో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ కూడా త్వరలో ఈ ఆపరేషన్‌లో చేరనుందని ఆయన తెలిపారు.
బలప్రయోగానికి వెనుకాడబోమని అమెరికా ఇప్పటికే నిరూపించినట్లు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్, జనరల్ డాన్ కెయిన్ తెలిపారు. ఈ వారంలో సముద్రంలో ఓ భారీ కంటైనర్ నౌక తమ హెచ్చరికలను పట్టించుకోలేదని, దీంతో దాని ఇంజిన్ రూమ్‌లోకి కాల్పులు జరిపి, మెరైన్లు దానిని స్వాధీనం చేసుకున్నారని వివరించారు. హిందూ-పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ఆంక్షలున్న ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లను కూడా అడ్డుకున్నట్లు ధృవీకరించారు.
"హర్మూజ్ జలసంధి నుంచి ఏ నౌక ప్రయాణించాలన్నా.. అమెరికా నౌకాదళం అనుమతి తప్పనిసరి" అని హెగ్‌సెత్ తేల్చి చెప్పారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళాలు సముద్రపు దొంగల్లా, ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. ఇరాన్ సముద్రంలో మైన్‌లను అమర్చితే.. ఏమాత్రం సంకోచించకుండా వారి ఫాస్ట్ బోట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
అధ్యక్షుడు ట్రంప్ ఒప్పందం కోసం వెంపర్లాడడం లేదని, అయితే ఇరాన్ తన అణు ఆశయాలను వదులుకుంటే చర్చలకు ద్వారాలు తెరిచే ఉంటాయని హెగ్‌సెత్ పేర్కొన్నారు. మరోవైపు, ఆదేశాలు వస్తే భారీ సైనిక చర్యలు చేపట్టేందుకు తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని జనరల్ కెయిన్ స్పష్టం చేశారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఈ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.