ఈ ఏడాది ఎల్‌నినో ముప్పు... పీఎండీఎస్ అస్త్రాన్ని ప్రయోగించాలన్న చంద్రబాబు
- వ్యవసాయ రంగంపై ఉన్నతస్థాయి సమీక్ష
- ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పీఎండీఎస్ విధానం అమలు
- రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం ఆదేశం
- రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక
- సాంకేతికత వినియోగంతో రైతులకు మెరుగైన సేవలు
- ఈ ఏడాది 11 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం లక్ష్యం
రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో, దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టింది. వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం జరిపిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వల్ల సగటు వర్షపాతం 92 శాతానికే పరిమితం కావచ్చని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి, కడప, కర్నూలుతో పాటు ప్రకాశం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు తలెత్తవచ్చని, ఇది పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సవాలును అధిగమించేందుకు ‘ప్రీ-మాన్‌సూన్ డ్రై సోయింగ్’ (పీఎండీఎస్) విధానాన్ని ఒక అస్త్రంగా ప్రయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాలు కురవకముందే విత్తనాలు నాటే ఈ పద్ధతి ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చు, ఎరువులు, నీటి వినియోగం తగ్గుతుందని అధికారులు వివరించారు. తద్వారా ఎకరాకు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పీఎండీఎస్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారు.
వ్యవసాయంలో సమూల మార్పులే లక్ష్యం
రైతుకు సాగు భద్రత కల్పించి, అధిక ఆదాయం సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏడాదంతా పొలం పచ్చగా ఉండేలా, భూమిని భాగాలుగా విభజించి ఒకే రైతు బహుళ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను మళ్లించాలని, వాటి వల్ల కలిగే లాభాలను వివరించి చెప్పాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతు బజార్ల నుంచి నేరుగా ఇంటికే సరుకులు డెలివరీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఏజెన్సీల సేవలు వినియోగించుకోవాలని ఆదేశించారు.
హార్టికల్చర్ హబ్.. ప్రత్యేక పంటలపై దృష్టి
రాష్ట్రంలో ఉద్యానవన రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మొత్తం 50 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా రాయలసీమను ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’గా తీర్చిదిద్దేందుకు క్లస్టర్ల వారీగా అభివృద్ధి ప్రణాళికలు చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే తొలిసారిగా 250 ఎకరాల్లో ‘కోకో సిటీ’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది ఔత్సాహిక రైతులకు ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా ఉపయోగపడాలని సూచించారు.
అరకులో కుంకుమ పువ్వు, అనంతపురంలో యాపిల్ సాగును ప్రోత్సహించడంతో పాటు అవకాడో, అంజీర్, పనస, మిరియాల సాగును విస్తరించాలని నిర్దేశించారు. అంజీర్ వంటి పండ్లను డ్రైఫ్రూట్స్‌గా మార్చి విలువ పెంచేలా చూడాలన్నారు. ‘ఏపీ మష్రూమ్ మిషన్ 2026-31’ కింద ఏటా లక్ష మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించాలని లక్ష్యం నిర్దేశించారు.
ప్రకృతి సాగుకు పెద్దపీట
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని అన్ని గ్రామాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. 2025-26లో 9.26 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం జరగగా, ఈ ఏడాది (2026-27) ఏకంగా 11 లక్షల హెక్టార్లకు పెంచాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 13,300 గ్రామ పంచాయతీల్లో 25 లక్షల మంది రైతులను ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తులకు సరైన సర్టిఫికేషన్ అందించి, అధిక ధరకు అమ్ముకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
సాంకేతికతతో రైతుకు భరోసా
వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై సీఎం దృష్టి సారించారు. ‘ఫార్మర్ యాప్’లో ఇప్పటివరకు 8 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారని అధికారులు తెలుపగా, రిజిస్ట్రేషన్‌తో పాటు ఎంతమంది రైతులు దానిని వినియోగించి లబ్ధి పొందుతున్నారనేదే ముఖ్యమని సీఎం అన్నారు. ఈ యాప్ ద్వారా పంటల వివరాలు, భూసార పరీక్షలు, వాతావరణ సమాచారం, ప్రభుత్వ పథకాలు వంటివి రైతులకు అందుబాటులో ఉంటాయి.
అదేవిధంగా, రైతు భరోసా కేంద్రాల పనితీరును పర్యవేక్షించేందుకు రూపొందించిన ‘ఆర్ఎస్కే ఇంటిలిజెన్స్ హబ్ డ్యాష్‌బోర్డ్’లో సమాచారం ఎప్పటికప్పుడు కచ్చితంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.