'నారప్ప'గా విక్టరీ వెంకటేశ్ అదుర్స్ ... టీజర్ విడుదల!
- నేడు వెంకటేశ్ పుట్టిన రోజు
- గంటల వ్యవధిలో 1.7 మిలియన్లకు పైగా వ్యూస్
- వెంకీ యాక్టింగ్ పై ప్రశంసల వర్షం
కాస్తంత నెరిసిన గుబురు గడ్డం, తలకు ఆకుపచ్చని తలపాగా, పంచెకట్టుతో కనిపిస్తున్న వెంకీ అందరినీ అలరిస్తున్నారు. కళ్లల్లో రౌద్రాన్ని చూపుతున్న నారప్ప స్టయిల్, ఈ చిత్రంలో అతని పాత్ర ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఈ టీజర్ చూసిన వారంతా వెంకీ చూపిన హావభావాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీజర్ ను మీరూ చూసేయండి.