కీలక పాత్ర చేయడానికి ఓకే చెప్పిన సిమ్రన్!

Simran gives nod for Andhadhun Tamil remake
  • నిన్నటితరంలో గ్లామర్ తారగా రాణించిన సిమ్రన్
  • ఇటీవలే ప్రారంభించిన తన సెకండ్ ఇన్నింగ్స్
  • ఇప్పటికే 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్'లో కీలక పాత్ర
  • 'అంధాధున్' తమిళ రీమేక్ లో ముఖ్య పాత్ర
తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలలో కథానాయికగా నటించి, గ్లామర్ పాత్రలకు పక్కా చిరునామాగా నిలిచిన నిన్నటితరం హీరోయిన్ సిమ్రన్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇప్పటికే మాధవన్ హీరోగా నటిస్తున్న 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె మరో చిత్రాన్ని అంగీకరించింది.

హిందీలో హిట్టయిన 'అంధాధున్' చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తుంటే.. తమిళంలో ప్రశాంత్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడీ తమిళ రీమేక్ లో సిమ్రన్ కీలక పాత్ర పోషించనుంది. హిందీ ఒరిజినల్ లో టబు పోషించిన పాత్రను తమిళ వెర్షన్లో సిమ్రన్ చేస్తోంది. ఈ విషయాన్ని సిమ్రన్ కూడా తాజాగా ధ్రువీకరించింది.

"అంధాధున్ లో టబు పాత్ర మంచి పాత్ర. అందులో నటించడం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను. సినిమా ఆద్యంతం నా పాత్ర కనిపిస్తుంది. చాలా ఛాలెంజ్ తో కూడిన పాత్ర అది. ప్రశాంత్ తో కలసి మళ్లీ ఇందులో నటించడం హ్యాపీగా వుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నాను" అని చెప్పింది సిమ్రన్.
Go Back to Shorts
Simran
Madhavan
Nitin
Prashanth

More Telugu News