హైదరాబాద్‌లో ఇటీవల గెలిచిన బీజేపీ కార్పొరేటర్ వాహనంపై రాళ్లతో దాడి!

  • బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్‌ లచ్చిరెడ్డి వాహనంపై దాడి
  • అనంతరం పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు
  • కారు అద్దాలు ధ్వంసం
  • పోలీసులకు లచ్చిరెడ్డి ఫిర్యాదు
ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో  బీజేపీ 48 సీట్లు దక్కించుకుని టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి కొత్తగా ఎన్నికైన కొందరు బీజేపీ కార్పొరేటర్లపై దాడులు జరుగుతుండడం కలకలం రేపుతోంది.

ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ శివారు వనస్థలిపురం పీఎస్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్‌ లచ్చిరెడ్డి వాహనంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, ఇటుకలతో దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఈ ఘటన నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిపై ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్‌లో లచ్చిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.  
Go Back to Shorts
BJP
TRS
Hyderabad
GHMC Elections
Crime News

More Telugu News